మీనా రెండో పెళ్లి.. నిజం ఏమిటంటే ?

168
- Advertisement -

నలభై ఆరేళ్ళ వయసులో ఎంతో అందంగా ఉన్నావ్ అంటూ హీరోయిన్ మీనాకి ఈ మధ్య కామెంట్స్ ఎక్కువైపోయాయి. ఈ మధ్య అబ్బాయిల నుంచి కూడా తనకు విచ్చలవిడిగా ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయని ఓ తమిళ ఇంటర్వ్యూలో మీనా సిగ్గు పడుతూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో మీనా సిగ్గు చూసిన వారంతా.. ఆమె రెండో పెళ్ళికి రెడీ అయిందంటూ కథనాలు రాయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి మీనా రెండో పెళ్లి పై రోజుకో పుకారు వస్తూనే ఉంది.

మరి వాటిల్లో ఏది నిజం ? ఏది అబద్దం ? అని తేల్చుకోలేక నెటిజన్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి మీనా రెండో పెళ్లి అంటూ బాగా హడావుడి జరుగుతుంది. అసలుకే భర్త పోయి పుట్టెడు దుఖంలో ఉన్న మీనా పై ఇలాంటి పుకార్లు రావడం విచిత్రమే. నిజానికి మీనా తన దుఖాన్ని దిగమింగుతూ.. తన కూతురు భవిష్యత్తు కోసం మళ్లీ సినిమాల్లో నటిస్తోంది.

అయితే, మీనాకి ప్రస్తుతం 46 ఏళ్లు మాత్రమే. దీంతో మీనా మళ్లీ పెళ్లి చేసుకుంటేనే బాగుంటుందని.. ఆమె సన్నిహితులు ఆమెకు సలహాలు ఇస్తున్నారట. పైగా తమ ఫ్యామిలీ సర్కిల్స్‌లోనే మీనా కోసం ఓ మిడిల్ ఏజ్ మ్యాన్‌ను చూశారట. అతను ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజర్ అని తెలుస్తోంది. కానీ, మీనా మాత్రం మళ్లీ పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. కాబట్టి.. ఇప్పట్లో మీనాకి మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు.

ఇవి కూడా చదవండి…

సీనియర్ హీరో .. నెలకో సినిమా

పిక్ టాక్ : భారీ బ్యూటీ ఎరుపు అందాలు

దర్శకుడిగా మారిన కమెడియన్

- Advertisement -