భారీ వర్షాలు…మేఘా రూ.10 కోట్ల విరాళం

155
meil

భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్‌ వరద బాధితులకు సాయం అందించేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే 4 లక్షల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పందించి 10 కోట్ల విరాళం అందించింది మేఘా ఇంజనీరింగ్స్ సంస్థ.

సీఎం సహాయ నిధికి 10 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ఆ సంస్ధ ప్రకటించగా సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంపా నాగేందర్‌, జనరల్‌ సెక్రటరీ మోహన్‌రెడ్డి ప్రకటించారు.

అలాగే జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముందుకు వ‌చ్చారు. త‌మ రెండు నెల‌ల జీతాన్ని ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని ప్ర‌జాప్ర‌తినిధులు భరోసా ఇచ్చారు.