ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పిన మెగాస్టార్ చిరు..

45

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు..ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే మై డియర్ ప్రభాస్’ అని ట్వీట్ చేశారు. ఈ సంవత్సరం నీకు అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. దైవాశీస్సులు నీకు ఉంటాయని అన్నారు. మరోవైపు పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ అవుతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.