మెగాస్టార్ చిరంజీవి @ 1 మిలియన్

61
chiru

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలె సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో అడుగుపెట్టిన చిరంజీవి ఎప్పటికప్పుడు తన సినిమా,ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్స్‌ని అందిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో చిరంజీవిని ఫాలో అయ్యే వారి సంఖ్య ట్విట్టర్‌లో 1 మిలియన్‌కు చేరింది. గత ఏడాది మార్చి 25న ఉగాది శుభ దినాన ట్విట్టర్‌లోకి అడుగుపెట్టగా రెండు రోజుల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్ చేరారు.

ఇక మెగాస్టార్ కు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు ఉన్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తుండగా తర్వాత ‘లూసిఫర్’ రీమేక్, ‘వేదాళం’ రీమేక్ లలో నటించనున్నారు.