ఏపీలో కరోనాతో ఒక్కరోజే 96 మంది మృతి..

42
covid

ఏపీలో కరోనా ఉదృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంట‌ల్లో 22,018 మంది క‌రోనా బారిన ప‌డగా 96 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,03,787కు చేరగా కరోనాతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 9,173 మంది మృతిచెందారు. జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన వివరాలను పరిశీలిస్తే అనంత‌పురంలో 11 మంది, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నంలో 10 మంది చొప్పున‌, విజ‌య‌న‌గ‌రంలో 9 మంది, చిత్తూరు, కృష్ణ‌లో 8 మంది చొప్పున‌, గుంటూరు, నెల్లూరులో ఏడుగురు చొప్పున‌, క‌ర్నూలు, శ్రీ‌కాకుళంలో ఆరుగురు చొప్పున‌, క‌డ‌ప‌లో న‌లుగురు మృత్యువాత‌ప‌డ్డారు.