ద‌స‌రా సెల‌వుల్లో ‘సైరా’ సంద‌డి..

209
syera

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ఈమూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హారిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, న‌య‌న‌తార ప‌లువురు పలువురు ప్ర‌ముఖ న‌టీన‌టులు ఈమూవీలో న‌టిస్తున్నారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా ఈమూవీ తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. తాజాగా విన‌య విధేయ రామ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా సైరా సినిమా గురించి చెప్పారు రామ్ చ‌ర‌ణ్.

sye-raa-narasimha-reddy2

సైరా చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంద‌ని..మ‌రో రెండు నెల‌ల్లో చిత్రిక‌ర‌ణ మొత్తం పూర్త‌వుతుంద‌న్నారు. ద‌స‌ర సెల‌వుల్లో సినిమాను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చెప్పారు. ఇక చిరంజివి 152 వ సినిమా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఉండ‌నుంద‌ని తెలిపారు. స‌మ్మ‌ర్ నుంచి ఈప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌న్నారు. కొర‌టాల మూవీ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి సినిమా ఉండ‌నుంద‌ని చెప్పారు. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామ మూవీ జ‌వ‌న‌రి 11ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.