మా నాన్నకు క్యాన్సర్ ఉంది: హృతిక్ రోష‌న్

203
Hrithik Roshan

త‌న తండ్రి క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ని తెలిపారు బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్. త‌న తండ్రితో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈవిష‌యాన్ని తెలిపాడు హృతిక్. నేటినుంచి అత‌నికి స‌ర్జ‌రీలు జ‌రుగ‌నున్న‌ట్లు తెలిపాడు. హృతిక్ సినిమాల‌న్నింటిని దాదాపుగా ఆయ‌న తండ్రి రాకేష్ బ్యాన‌ర్లోనే చేశారు. శస్త్రచికిత్స రోజు కూడా ఆయన జిమ్‌కు రావడం మానరని తెలుసు. నాకు తెలిసినంత వరకు ఆయన చాలా దృఢమైన వ్యక్తి. కొన్ని వారాలుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

hrithik roshan

కానీ ఆయన క్యాన్సర్‌తో పోరాడుతూనే సంతోషంగా జీవిస్తున్నారు. కుటుంబంలో ఆయనలాంటి లీడర్‌ ఉన్నందుకు మేమెంతో అదృష్టవంతులం అని ట్వీట్ చేశారు. హిందీలో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న ‘క్రిష్‌’ సిరీస్‌ నుంచి నాలుగో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో రాకేశ్‌ బిజీగా ఉన్నారు. ఇంతలో ఆయనకు క్యాన్సర్‌ ఉందని తెలియ‌డంతో ‘క్రిష్‌ 4’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1970లో వచ్చిన ఘర్ ఘర్ కీ కహానీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు రాకేష్ రోష‌న్.