కొండపొలం…మెగాస్టార్ రివ్యూ

35
chiru

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా తెరకెక్కిన చిత్రం కొండపొలం. సినిమా ప్రీమియర్ షో చూసిన వారు సూపర్బ్ అని రివ్యూ ఇచ్చేయగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసి రివ్యూ ఇచ్చేశారు.

క్రిష్ సినిమాలంటే డిఫరెంట్ జోనర్ మూవీస్ అని అనుకుంటాం. ఈ సినిమాకు చూసిన వారు థ్రిల్‌కు లోన‌వుతార‌నే మాట వాస్తవం అన్నారు. కొండపొలంకు సంబంధించిన పుస్త‌కం ఏదీ తాను చ‌ద‌వలేదని…. వైష్ణ‌వ్ ఓరోజు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మామ..ఇలా క్రిష్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో ‘కొండ‌పొలం’ అనే సినిమా చేస్తున్నాను అన‌గానే వెంటనే ఓకే చెప్పానని తెలిపారు.

వైష్ణ‌వ్ తేజ్ పెర్ఫామెన్స్ కానీ, క్యారెక్ట‌రైజేష‌న్ కానీ అన్నీ డిఫ‌రెంట్‌గా ఉన్నాయి. క్రిష్‌ సినిమాల‌ను నేను ముందు నుంచి చూస్తూ వ‌స్తున్నాను. ఒక సినిమాకు మ‌రో సినిమాకు సంబంధం ఉండ‌దు. కొండ‌పొలం చిత్రం చ‌క్క‌టి ర‌స్టిక్ ల‌వ్‌స్టోరి. ఈ ప్ర‌కృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పిన క‌థాంశం. మంచి మెసేజ్‌తో కూడిన ల‌వ్‌స్టోరి అని చెప్పారు చిరు.