ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ..

280
puvvada

భారత స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 131వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అబుల్ కలాం జయంతి సందర్భంగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమంలో అబుల్ కలాంకు మంత్రి పువ్వాడ నివాళ్లు అర్పించారు.

Abul-Kalam-Azad

అనంతం మంత్రి మాట్లాడుతూ.. భారతీయ జాతీయత ఐక్యతలో నేను ఓ భాగము ” అని గట్టిగా నినదించిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని.. ఆయన సేవలు మరువలేనివని రవాణా శాఖ మంత్రి అన్నారు. ఆయన దేశం కోసం చేసిన పోరాటం, సేవలను మంత్రి పువ్వాడ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్రానంతరం ఆజాద్.. నెహ్రూ కేబినెట్‌లో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్డారు.