పొంగులేటికి గుణపాఠం తప్పదా ?

48
- Advertisement -

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తరచూ హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. బి‌ఆర్‌ఎస్ లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు సి‌ఎం కే‌సి‌ఆర్. ఆ తరువాత నుంచి బి‌ఆర్‌ఎస్ టార్గెట్ గా ఆయన ఎన్నో వ్యూహాలకు తెర తీస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కే‌సి‌ఆర్ ను ఓడిస్తానంటూ పగటి కలలు కంటున్నారు. అయితే పొంగులేటి కలలన్నీ ఊహాజనితమైనవనే సంగతి తెలంగాణ ప్రజానీకానికి తెలిసిన విషయమే. ప్రస్తుతం అటు కాంగ్రెస్, ఇటు బిజెపి.. ఏ పార్టీ గూటికి చేరలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్న పొంగులేటి.. ప్రత్యేక పార్టీ కూడా పెడతారనే చర్చ జరుగుతోంది.

Also Read:ఇకపై సినిమాల్లో నటించను:స్టాలిన్

అయితే ఆయనకు తెలంగాణలో పార్టీ పెట్టి ప్రజాధరణ పొందే సత్తా ఉందా అంటే నో ఛాన్స్ అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. మీడియాల్లోనూ సోషల్ మీడియాల్లోనూ అనవసరంగా తనకు తాను హైప్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు పొంగులేటి. అయితే బి‌ఆర్‌ఎస్ లో ఉన్నప్పుడూ ఖమ్మం జిల్లాలో మచి బలమైన నేతగా పొంగులేటికి పేరుండేది. కానీ బి‌ఆర్‌ఎస్ వీడిన తరువాత ఆ జిల్లా ప్రజలు కూడా పొంగులేటి వైఖరి పై పెదవి విరుస్తున్నారు. దీంతో పొంగులేటి బి‌ఆర్‌ఎస్ టార్గెట్ గా ఎన్ని వ్యూహాలు రచించిన ఖమ్మం జిల్లా వాసుల నుంచి ఆయనకు షాక్ తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా లో బి‌ఆర్‌ఎస్ హవా గట్టిగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా పొంగులేటి ఎలాంటి వ్యూహరచన చేసిన ప్రజలు తిప్పికొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి సి‌ఎం కే‌సి‌ఆర్ టార్గెట్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజల నుంచి గుణపాఠం తప్పెలా లేదు.

Also Read:కీళ్ళ నొప్పులు తగ్గడానికి..!

- Advertisement -