మేడారం జాతరలో ప్లాస్టిక్ నిషేధంపై సమీక్ష..

321
medaram

ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రామప్ప దేవాలయ అభివృద్ధి, మేడారం జాతరలో ప్లాస్టిక్ నిషేధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ జగదీశ్‌లు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రామప్ప దేవాలయానికి త్వరలో నే యునెస్కో గుర్తింపు దక్కనుంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కుతుంది అని విశ్వసిస్తున్నాం. రామప్పకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ కోసం కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.

mlc

రామప్పలో 5కోట్లతో ఆడిటోరియం నిరిమిస్తాము. కోటి రూపాయల సీఎస్ఆర్ నిధులతో రామప్ప ఆర్చి నిర్మిస్తాము. అలాగే రామప్పలో 10 ఎకరాల స్థలంలో శిల్పిల కల ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్‌ను కోరుతాము. ములుగు జిల్లాను రాష్ట్రంలో నే ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ అన్నారు.

ఇక త్వరలో జరిగే మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చేందుకు కృషి చేద్దాం. అందుకోసం వివిధ వర్గాల ప్రముఖులతో ప్లాస్టిక్ రహిత మేడారం జాతరగా మార్చడం కోసం విస్తృత ప్రచారం చేస్తాం. మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు కోసం కృషి చేస్తామని ఎమ్మెల్సీ పోచంపల్లి తెలిపారు.

mlc pochampally

కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. రామప్ప అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం. మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని లేకుండా చేసేందుకు విస్తృత ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన తీసుకోస్తాం. ములుగు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిదేందుకు ప్రజా ప్రతినిధులతో కలిసి కృషి చేస్తున్నామని కలెక్టర్ అన్నారు.