మంత్రి పువ్వాడతో జూ.ఎన్టీఆర్ భేటీ..!

41
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా మిని ట్యాంక్ బండ్‌ల నిర్మాణంలో భాగంగా ఖమ్మంలోని లాకారం ట్యాంక్ బండ్‌పై విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణకు సన్నహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌తో నటుడు ఎన్టీఆర్‌ మర్యదాపూర్వకంగా కలిశారు.

Also Read: TSPSC:పరీక్షల నెలగా మే…!

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే28న జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయాలిని నిర్ణయించారు. జూబ్లీహిల్స్‌లోని తారక్ నివాసానికి వెళ్లి విగ్రహావిష్కరణకు లాంఛనంగా ఆహ్వనం అందించారు. విగ్రహాన్ని శ్రీకృష్ణుడి అవతారంలో 54అడుగుల ఎత్తులో తయారు చేశారు. ఇందుకుగాను రూ.4కోట్ల ఖర్చయినట్లు తెలుస్తోంది. మంత్రి పువ్వాడతో పాటు తానా సభ్యులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ప్రవాస భారతీయులు వెంట ఉన్నారు.

Also Read: KTR:తెలంగాణ దేశానికే రోల్ మోడల్

- Advertisement -