మర్రి చెన్నారెడ్డి జయంతి.. నివాళులర్పించిన నేతలు..

14

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, మాజీ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి 103వ జయంతి ఈరోజ. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇందిరా పార్క్‌లోని మర్రి చెన్నారెడ్డి రాక్ గార్డెన్‌లో ఆయన సమాధి వద్ద పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ గౌడ్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చిన్నారెడ్డి హాజరై నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం మర్రి చెన్నారెడ్డి చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. నిరుద్యోగ యువత మహిళలను కూడగట్టుకొని మంచి పరిపాలన పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోందనీ అన్నారు. యూపీలో ప్రియాంక గాంధీ మహిళలకు 40శాతం సీట్లు కేటాయించడంతో మహిళల పట్ల కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి స్పష్టమవుతోందన్నారు.