టీడీపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు..

16

గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భోగి మంటలు,రంగవల్లులు,బసవన్న,డోలు సన్నాయి,తదితర కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజేసే ఈ పండగ అందరి ఇళ్లల్లో సుఖ సంతోషాలు నింపాలన్నారు.రాష్ట్ర ప్రజలు ఒకవైపు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు వైసీపీ సర్కారు అవలంబిస్తున్న విధానాలతో సామాన్యులకు కష్టాలు మరింత రెట్టింపయ్యాయని అన్నారు.

తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరనాన్ని తీసుకు రావాల్సిన వైసీపీ ప్రభుత్వం అవేమి పట్టనట్టుగా వ్యవహరిస్తోంది అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతి కానుకలు ఇచ్చి పేదలకు అండగా నిలిచామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్,గంధం శ్రీనివాస్,బొండా జగన్,మొల్లి ముత్యాల నాయుడు,రౌతు శ్రీనివాస్,ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.