రైతులకు భరోసాగా సొసైటీలు: మంత్రి ఎర్రబెల్లి

375
marneni ravinderrao
- Advertisement -

సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానం సోసిటీ ఛైర్మన్ గా ప్రారంభం అయిందని… రైతులకు భరోసా కల్పించేలా సొసైటీలు పని చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ అర్బన్ డీసీసీబీ ఛైర్మన్‌గా మార్నేని రవీందర్ రావు ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి పాల్గొన్న ఎర్రబెల్లి.. గత పాలకమండలి అవకతవకలకు పాల్పడిందన్నారు. ఎస్సార్ ఎస్పీ, దేవాదుల తో ఉమ్మడి వరంగల్ సస్యశ్యామలం చేస్తాం అని.. రైతును రాజును చేయాలన్న సీఎం కేసీఆర్ కలలను నిజం చేసేలా డీసీసీబీ పాలక మండలి పని చేయాలని సూచించారు. డీసీసీబీకి మరింత గుర్తింపు వచ్చేలా పని చేయాలన్నారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో నే రైతులకు మేలు జరిగిందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. అందుకే సొసైటీ ఎన్నికల్లో రైతులు టీఆర్‌ఎస్ పార్టీ పట్టం కట్టారని…సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేసి యాసింగిలో ను నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు.

తనకు డీసీసీబీ చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మార్నేని రవీందర్ రావు. పారదర్శకంగా.. రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరూరి రమేష్, తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, మేయర్ గుండా ప్రకాష్ రావు, కార్పొరేషన్ చైర్మన్ లు నాగుర్ల వెంకటేశ్వర్ రావు, వాసుదేవ రెడ్డి, యాదవ రెడ్డి, జడ్పీ చైర్మన్ లు సుధీర్ కుమార్, గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -