ఈ మధ్య కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ అంటూ ఇంట్లో ఉన్న భర్త, భార్య, పిల్లలు, అమ్మానాన్నలను పట్టింకుకోలేని బిజీ లైఫ్ గడుపుతున్నారు చాలా మంది. అలాంటి సంఘటనే ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఎప్పడు సోషల్ మీడియాలో మునిగితేలుతున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, భార్యను హత్యచేశాడు. ఈ సంఘటన ఈ నెల 12న జరిగింది.
అసలు విషయానికి వస్తే హరి ఓం(35), లక్ష్మి(32) ఇద్దరు భార్యభర్తలు. వీళ్లిద్దరికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. కంప్యూటర్ రిపేర్ నిర్వహిస్తాడు హరి ఓం. అయితే రెండేళ్ల క్రితం భార్యకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. అప్పటి నుంచి ఆమె నిత్యం ఫోన్‌తో బిజీగా ఉంటుంది. భర్తను,పట్టించుకోకుండా.. సోషల్ మీడియాలో మునిగి తేలుతుంది. పిల్లలను పట్టించుకోకుండా, ఇంటి సమస్యలు
పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించసాగింది భార్య లక్ష్మి. భార్యపై కోపం పెంచుకుని, ఫేస్బుక్ ద్వారా వివాహేతర సంబంధం నడిపిస్తున్నట్లు అనుమానంతో భార్యతో గొడవ పెట్టుకున్నాడు.
ఇదే క్రమంలో భార్య గొంతునుమిలి చంపేశాడు భర్త. మరుసటి రోజు కూతురుని చూడడానికి వచ్చిన తండ్రి, బెడ్‌పై శవమై పడివున్న కూతురిని చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని నిందితుడు హరిఓంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.