బీజేపీకి మమతా స్ట్రాంగ్ కౌంటర్..!

272
mamatha
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. దేశం మొత్తం విస్తరించిన బీజేపీ బెంగాల్ గడ్డపై మాత్రం పాగా వేయలేకపోతుంది. ఆఖ‌రకు మోదీ వేవ్‌లో కూడా బెంగాల్‌లో మమతాదే పై చేయి అయింది. అయితే ఈసారి ఎలాగైనా బెంగాల్‌లో కాషాయ జెండా ఎగరవేయాలని మోదీ, అమిత్‌షాలు పట్టుదలగా ఉన్నారు.

అందుకే టీఎంసీ మంత్రులను, ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కుని మమతాని దెబ్బతీయడానికి బీజేపీ కుటిల యత్నాలు చేస్తుంది. అయితే దెబ్బతిన్న పులి పంజా ఎలా ఉంటుందో తాను చూపిస్తానంటోంది మమతక్క. తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాషాయ గూటిలోకి జారుకుంటున్నా మమతా మాత్రం అదరడం లేదు..బెదరడం లేదు..మోదీతో పోటీకి సై అంటోంది. వచ్చేసారి కూడా మళ్లీ తనదే అధికారం తనదే..నేనే సీఎం అంటోంది.

తాజాగా పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తనను రాయల్‌ బెంగాల్‌ టైగర్‌గా అభివర్ణించుకున్నారు. తాను బీజేపీ బెదిరింపులకు తలొగ్గేంత బలహీన వ్యక్తిని కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముర్షిదాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో అమె మాట్లాడుతూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. అంబానీలు, అదానీల వంటి వారికి లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చిందని మండిపడ్డారు.

నేను బెంగాల్ పులిని నన్ను ఎవరూ భయపెట్టలేరు అంటూ మోదీకి కౌంటర్ ఇచ్చారు. నేను బలహీన మనస్కురాలినని చెప్పడానికి ఏ ఆధారమూ లేదు. దేనికీ చలించే వ్యక్తిని కూడా కాదు. ఉక్కుమనిషిని. జీవించినంతకాలం తల ఎత్తుకునే ఉంటా. బెంగాల్‌ పులిలాగానే జీవిస్తా. నన్నెవరూ భయపెట్టలేరు మమతా వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు తమ పార్టీ నేతలను ఎంత మందిని తీసుకువెళ్లినా భయపడేది లేదు అంటూ ఇన్‌డైరెక్ట్‌గా మమతాదీదీ మోదీకి కౌంటర్ ఇచ్చారు. మమతా వ్యాఖ్యలు ఇప్పుడు బెంగాల్ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

- Advertisement -