మమతా ఆస్తులెంతో తెలుసా..?

190
mamata
- Advertisement -

బెంగాల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గాయపడ్డారు దీదీ. రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనుండగా నందిగ్రామ్ నుండి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు మమతా.

ఇక తన ఎన్నికల అఫిడవిట్‌లో మమతా చెప్పిన ఆస్తుల లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. మమత ఆస్తి రూ. 16.72 లక్షలే.. సొంత వాహనం కూడా లేదట. చేతిలో రూ. 69,255 నగదు ఉందని రూ. 13.53 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించింది దీదీ.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ)లో రూ. 18,490 పొదుపు చేశానని, తన వద్ద 43,837 విలువైన 9 గ్రాముల బంగారం ఉందని వెల్లడించారు మమతా. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగులో లేవని వెల్లడించారు. ఇక ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు సువేందు అధికారి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్‌, నటుడు మిథున్‌ చక్రవర్తి హాజరుకానున్నారు. రాష్ట్రంలో మొత్తం 8 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -