కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది.
ఎన్టీఆర్‌కు విలన్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా తాజాగా మరో విలన్ ఉండనున్నారట. ఈ విషయాన్ని మలయాళ స్టార్ సోషల్ మీడియా ద్వారా లీక్ చేసేశాడు. విభిన్నమైన పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన షైన్ టామ్ చాకో ..దేవర సినిమాలో కూడా విలన్ గా నటించనున్నారట. షైన్ టామ్ చాకో షేర్ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Also Read:మంచి నీళ్లు..జీర్ణక్రియ ప్రక్రియ
కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఇది 30వ సినిమా. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు.
Also Read:మలబద్దకం…పరిష్కారాలు