మలబద్దకం…పరిష్కారాలు

103
Best Home Remedies to Fight Loose Motion

ఆధునిక సమాజంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం. శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియలో మలవిసర్జన. కొందరిలో రోజుకు రెండు సార్లు జరిగితే, కొందరిలో రెండు-మూడు రోజులకొకసారి అవుతుంది. వారంలో కనీసం మూడు సార్లయినా పేగుల్లో కదలికలు లేకపోతే మలబద్దకం ఏర్పడుతుంది. మలబద్ధకం ఏర్పడినపుడు మలం చాలా గట్టిగా తయారవుతుంది. విసర్జనకు చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని సార్లు మలవిసర్జన సమయంలో నొప్పిగా కూడా ఉంటుంది. మలబద్ధకంగా ఉన్న వారికి కడుపు ఉబ్బరంగా ఉన్న భావన కలుగుతుంది. పెద్దపేగు ఎక్కువ నీటిని పీల్చుకోవడం లేదా పెద్దపేగు కండరాలలో కదలికలు తగ్గిపోవడం వల్ల పేగులో మలం కదలికలు చాలా నెమ్మదిగా కదులుతుంది అందువల్ల మలబద్దకం ఏర్పడుతుంది. ఫలితంగా మలం గట్టిగా తయారవుతుంది.

దీనికి అనేక కారణాలున్నాయి. నీళ్లు తగినంత తీసుకోకపోవడం, ఆహారంలోఎక్కువ ఫైబర్ లేకపోవడం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం. తగినన్ని నీళ్లు తీసుకోకుండా, ఆహారంలో చక్కెరల శాతం పెరిగితే పెరిస్టాలిక్ కండరాలలో కదలికలు చాలా నెమ్మదిస్తాయి. మలపదార్థం కూడా గట్టి పడి గరుకుగా తయారవుతుంది. ఇలాంటి గరుకు మలం వల్ల విసర్జన సమయంలో మలద్వారం దగ్గర చర్మం చిట్లి పోవడం వల్ల ఫిషర్ ఏర్పడుతుంది. అందువల్ల నొప్పిగా ఉంటుంది.

Best Home Remedies to Fight Loose Motion

తినే ఆహారంలో పీచులేనపుడు కూడా సమస్యగానే వుంటుంది. పీచు లేనందువలన తగినంత కదలికలు లేకుంటే, మలం బయటకు జారదు. పిల్లలు సాధారణంగా కొవ్వులు అధికంగా వుండే ఫాస్ట్ ఫుడ్స్ తింటారు (బర్జర్లు, పిజ్జాలు, మిల్క్ షేక్ లు, ఫ్రైలు )వీటిలో పీచు వుండదు. ప్రోసెస్ చేసిన కేండీలు, కుక్కీలు, కూల్ డ్రింక్ లు కూడా పీచు లేక హానికరంగా వుంటాయి. కొన్ని మార్లు పిల్లలలో ఐరన్ లోపం కొరకు వేసే మందులు కూడా మలబద్ధకం కలిగిస్తాయి.

మలబద్దకం నివారణకు కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటిస్తే క్రమంగా నివారించవచ్చు. ద్రవపదార్థాలు మరియు నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మలం మృదువుగా, స్నిగ్థంగా, ఎక్కువగా తయారవుతుంది. పీచుపదార్థాలుఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, అరటిపండ్లు, జామకా మంచివి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవడం వలన మలవిసర్జన త్వరలోగా సాఫీగా జరుగుతుంది. ముఖ్యం మెంతి కూర రోజూ తినాలి.

ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాలు మానివేయాలి.నిలువ పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు మానివేయాలి. ఒక పద్ధతిలో వ్యాయామం చేయడం వలన మలబద్దకం కలుగదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి.మలవిసర్జన చేసేటప్పుడు బలవంతంగా ముక్కకూడదు. ఇందువలన అర్శమొలలు తయారయి, తిరిగి మలబద్దకాన్ని కలుగజేస్తాయి. ఇంత వైద్య సదుపాయం వుండి కుడా ఇప్పటి తరం అందుకు వ్యతిరేకంగా ఎందుకు ఇలా వున్నారో ఎప్పుడైనా ఆలోచించామా ? అలా ఆలోచించి వుంటే ఇలా పరిస్థితులు దాపురించేవి కాదేమో. ఇప్పటికైనా మించిపోయింది లేదు.