ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మహమూద్ అలీ

188
mahmood ali
- Advertisement -

తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా కొత్త మసీదును, దేవాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు.

ప్రస్తుతం పాత సెక్రటేరియట్ భవనంలో ఉన్న మసీదు ,దేవాలయాల కన్నా పెద్ద స్థాయిలో వాటిని నిర్మించేందుకు సెక్యులర్ నాయకుడైన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం దీనికి సంబంధించి త్వరలోనే నిర్వాహకులతో మాట్లాడేందుకు సమావేశాలు నిర్వహించనుండడం పట్ల హోంమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

నూతన సెక్రటేరియట్ భవనాన్ని అధునాతన స్థాయిలో నిర్మించడం పట్ల అది ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని హోం మంత్రి అన్నారు. నూతన భవనం లో సాంకేతిక, ఇతర సౌకర్యాలు తో కూడిన సదుపాయాలు ఉండడం వల్ల ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనకరమని హోం మంత్రి తెలియజేశారు.మసీదు, దేవాలయాలు కూడా భారీ ఎత్తున నిర్మించాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ స్వాగతించారు.

- Advertisement -