బీసీసీఐ సీఈవో రాహుల్… రాజీనామా అమోదం

157
bcci ceo
- Advertisement -

బీసీసీఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో) రాహుల్‌ జోహ్రీ రాజీనామాకు అమోదం తెలిపింది బోర్డు. గతేడాది డిసెంబర్‌లో సీఈవో పదవికి రాజీనామా చేశారు రాహుల్‌. అయితే అప్పటినుండి రాజీనామాను పెండింగ్‌లో పెట్టిన బోర్డు…తాజాగా ఆయన రాజీనామాను అమోదించింది.

వాస్తవానికి రాహుల్ పదవీకాలం 2021 వరకు ఉండగా బోర్డు సభ్యులతో విభేదాల కారణంగా రాజీనామా చేశారు. 2016లో బీసీసీఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో)గా రాహుల్‌ బాధ్యతలు చేపట్టారు.

బీసీసీఐలో చేరడానికి ముందు ఆయన డిస్కవరీ నెట్‌వర్క్స్ ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలాగే సౌత్ ఆసియా జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు.

- Advertisement -