హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా

111
homeminster

తెలంగాణలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 244 గంటల్లో 983 కరోనా కేసులు నమోదుకాగా ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 816 కేసులు నమోదయ్యాయి.

ఇక తెలంగాణలో ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీకి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన అపోలో ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం.

కొద్దిరోజుల క్రితం మహమూద్ అలీ సెక్యూరిటీ సిబ్బందిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అందుకే అప్పటి నుండి క్వారెంటైన్ లో ఉన్న మంత్రి పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా వచ్చిన టెస్ట్ రిపోర్టులో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.