మహేశ్ బాబుకు రష్మీక స్పెషల్ గిప్ట్

173
mahesh rashmika

కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మీక మందన తెలుగులో ఛలో సినిమాతో మంచి హిట్ సాధించింది. కాగా తాజాగా రష్మిక సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీకి ఓ స్పెషల్ గిప్ట్ పంపించింది. కొన్ని మామిడికాయలు, ఆవకాయ పచ్చడి మరికొన్ని ఫ్రూట్స్ ఇలా అన్ని ఓ ప్యాక్ చేసి మహేష్ బాబుకి సెండ్ చేసింది రష్మిక. ఈ గిప్ట్ ను అభిమానులతో పంచుకున్నారు మహేశ్ బాబు భార్య నమ్రత. ఈసందర్భంగా రష్మీకకు థ్యాంక్స్ చెప్పింది నమ్రత. కరోనా లాక్ డౌన్ సమయంలో మాకు వచ్చిన ఫస్ట్ గిప్ట్ ఇదే అని చెప్పింది.

కాగా రష్మీక మందన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. ఈమూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈమూవీ షూటింగ్ సమయంలో మహేశ్ బాబు ఫ్యామిలీతో రష్మీకకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. రష్మిక మందన ఇటివలే నితిన్ సరసన భీష్మ సినిమాలో నటించింది. ఇక అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసింది రష్మీక.