బాలీవుడ్ లోకి మహేశ్ బాబు..దర్శకుడు ఎవరో తెలుసా?

265
mahesh-babu

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా అభిమానులు ఉన్నారు. మహేశ్ బాబు నటించి స్పైడర్ సినిమాలో తమిళ్ , మలయాళం లో కూడా విడుదలైంది. తెలుగులో ఈసినిమా ప్లాప్ అయినా అక్కడే మాత్ర పర్వాలేదు అనిపించింది. ఇటీవల సౌత్‌లో పాన్‌ ఇండియా సినిమాల హవా కనిపిస్తుండటంతో మహేష్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ కూడా ఓ పాన్‌ ఇండియా సినిమా చేయాలని భావిస్తున్నాడట.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. మహేశ్ బాబు కోసం కేజీఎఫ్ దర్శకుడు ఓ మంచి కథను సిద్దం చేశాడట. యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం భారీ విజయన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రశాంత్ నీల్ మహేశ్ కథ చెప్పగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మహేష్‌ బాబు ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్, మిలటరీ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు.