వివాహం చేసుకున్న టిక్ టాక్ జంట

240
tik-tok

సోషల్ మీడియా యాప్ ల ద్వారా చాలా మంది సెలబ్రెటీలు అవుతున్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు తమ టాలెంట్ ను నిరుపించుకుంటు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా టిక్ టాక్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టిక్ టాక్ ద్వారా చాలా మంది స్నేహితులు కూడా అవుతున్నారు.

కర్ణాటకలో టిక్ టాక్ ద్వారా పరిచయం అయిన ఓ జంట ఇటివలే పెళ్లి కూడా చేసుకుని ఒక్కటయ్యారు. టిక్‌టాక్‌ చేస్తూ పాపులర్‌ అయిన అల్లు రఘు, సుష్మితా శేషగిరి ఒక్కటయ్యారు. ఈ జోడి చేసిన టిక్‌టాక్‌ వీడియోలకు సామాజిక మాధ్యమాలలో మంచి పేరుంది.

గురువారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక నటుడు ధ్రువసర్జా వీరాభిమాని అయిన రఘు ఆయనను అనుకరించి చేసిన పలు టిక్‌టాక్‌ వీడియోలు భారీ వ్యూస్‌ సాధించాయి. రఘు ఆహ్వానం మేరకు టిక్‌టాక్‌ జోడి వివాహ కార్యక్రమానికి హాజరైన ధ్రువసర్జా దంపతులను ఆశీర్వదించారు. ఇక రఘు బుల్లితెరతో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.