వెబ్ సిరీస్‌లోకి మహేశ్!

121
Mahesh_Babu

కరోనాతో సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలోకి వెళ్లిపోగా థియేటర్‌ల ఓపెన్‌పై ఇంకా సందిగ్దం కొనసాగుతూనే ఉంది. అయితే నష్టాల నుండి కాసింతైన గట్టెక్కేందుకు ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు నిర్మాతలు.

ఇప్పటికే పలువురు హీరోల సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడంతో దర్శకులు,సెలబ్రెటీలు వెబ్ సిరీస్‌ల వైపు అడుగులేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వెబ్ సిరీస్ బాటపట్టనున్నట్లు తెలుస్తోంది.

తన నిర్మాణ సంస్ధ ద్వారా వెబ్ సిరీస్‌లను నిర్మించే పనిలో ఉన్నారట మహేశ్. ఈ వెబ్ సిరీస్‌కు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే అడవి శేషుతో ‘మేజర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు మహేశ్.