ఎఫ్‌2..టీంకి మహేష్‌ విషెస్

261
venkatesh mahesh babu
- Advertisement -

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌-వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఎఫ్‌2.ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్షకుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు నమోదుచేసిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచిరెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఎఫ్‌2 టీజర్‌ని ప్రశంసిస్తూ విషెస్ చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

F2 టీజర్ చూశాను!! భలే సరదాగా, వినోదభరితంగా ఉంది. వెంకీ సార్ ఇరగదీశారు. మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే సార్!!’ అంటూ మహేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ పెద్ద హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -