“మహర్షి” కోసం తారక్, చెర్రీ

293
ntr Ramcharan Maharshi
- Advertisement -

సూపర్ స్టార్ మహేవ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహర్షి. ఈచిత్రం మే9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మహేశ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా…అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈచిత్రాన్ని దిల్ రాజు, అశ్వినిదత్, పివిపిలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన సాంగ్స్ , ఫస్ట్ లుక్ లు ఎంతోగానో ఆకట్టకుంటున్నాయి. ఈసినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఈమూవీ ఫ్రీ రిలీజ్ వేడుకను మే1న హైదరాబాద్ లోని పిపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. మహేశ్ నటిస్తున్న 25వ సినిమా మహర్షి కావడంతో…ఆయన నటించిన 24సినిమాల దర్శకులను ఈఫంక్షన్ కు ఆహ్వానించనున్నారు. అయితే ఈ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా ఎవరూ వస్తారన్నది సస్పెన్స్ గా ఉంది. టాలీవుడ్ టాప్ హీరోలు మహేశ్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు చాలా దగ్గరి మిత్రులు అన్న విషయం తెలిసిందే.

మహేశ్ నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహర్షి మూవీకి కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ముఖ్య అతిధులుగా రానున్నారని తెలుస్తుంది. రామ్ చరణ్ కు గాయం కారణంగా ఈ ఫంక్షన్ కు రాలేకపోయినా ఎన్టీఆర్ రావడం మాత్రం పక్కా అంటున్నారు చిత్రయూనిట్. ఈవిషయం పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకూ వేచి చూడాల్సిందే.

- Advertisement -