Mahesh:మహేష్ రు’బాబు’.. కిక్కివ్వాట్లేదా?

29
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘ గుంటూరు కారం ‘. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్, రెండు లిరికల్ సాంగ్స్ కూడా విడుదల అయ్యాయి. ఇక క్రిస్టమస్ నుంచి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే గుంటూరుకారం విడుదల అయిన పోస్టర్స్ అన్నిటిలో కూడా మహేష్ బాబు ఒకే లుక్ తో కనిపిస్తుండడంతో అభిమానులు కొంత నిరాశగా ఉన్నారు..మహేష్ బాబును ఊర మాస్ గా చూపిస్తునట్లు చిత్రయూనిట్ మొదటి నుంచి చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు విడుదలైన టీజర్, పోస్టర్స్ లలో రొటీన్ మహేష్ బాబే కనిపించాడనే టాక్ వినిపిస్తోంది. .

రమణగాడి రుబాబు అంటూ మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫ్యాన్స్ కు కిక్కివ్వట్లేదానే నిరాశ వ్యక్తమవుతోంది. దాంతో మహేష్ లోని ఊర మాస్ ను పరిచయం చేసేలా ఓ మాస్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈనెల 31న లేదంటే న్యూ ఇయర్ కానుకగా మూడో సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి.. ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం కొంత నిరాశగా ఉన్న సూపర్ స్టార్ అభిమానులకు ముందు రోజుల్లో విడుదలయ్యే ప్రమోషనల్ కంటెంట్ తో చిత్రయూనిట్ సూపర్ కిక్కు ఇస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాకు పోటీగా మరో నాలుగు సినిమాలు సంక్రాంతి రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సంక్రాంతికి మహేష్ రు’బాబు’ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:

IND vs SA:సఫారీ గడ్డపై చెత్త రికార్డ్!

- Advertisement -