దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇక కుటుంబసమేతంగా క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు మహేష్, రామ్ చరణ్.ఈ సందర్భంగా వీరు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అందంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీల వెలుగులు, శాంతాక్లాజ్ వేషధారుల సందడితో క్రిస్టమస్ పర్వదినం ఆహ్లాదభరితంగా సాగింది. నాగచైతన్య, సమంత దంపతులు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘చిరునవ్వులతో జీవితమనే యుద్ధాన్ని జయించాలి. ప్రతి రోజూ శుభదినం కావాలి. అందరికి హ్యాపీ క్రిస్మస్’ అని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.
మరోవైపు మహేష్‌బాబు, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా సన్నిహితులతో కలిసి క్రిస్మస్ సంబరాల్లో పాల్గొనగా ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఉపాసన ట్వీట్ చేశారు. మహేష్ గారాలపట్టి సితారతో కలిసి ఉపాసన ఫొటో దిగారు. కోలీవుడ్ బ్యూటీ నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో శృతిహాసన్ తన ప్రియుడు మైకేల్ కోర్సెల్‌తో వేడుకల్ని ఆస్వాదించారు. బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్ క్యాన్సర్ బాధిత చిన్నారులతో కలిసి క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు.
Our very Merry Christmas
@diamehtabhupal @urstrulyMahesh #ramcharan pic.twitter.com/o9D18oQkQS
— Upasana Konidela (@upasanakonidela) December 26, 2018