డెహ్రాడూన్ లో “మ‌హేశ్ 25” షూటింగ్ ప్రారంభం..

237
mahesh babu

భ‌ర‌త్ అనే నేను సినిమా విజ‌యం త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చాలా గ్యాప్ తీసుకుని సినిమాను చేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌హేష్ బాబు 24 సినిమాలు చేయ‌గా..ఇప్ప‌డు చేయ‌బోయేది 25వ సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌హేశ్ 25వ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని తెలిసిందే. అందుకోసం వంశీ అన్ని ఏర్పాట్లును పూర్తి చేసుకున్నాడు. ఈసినిమా మొద‌టి షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో ప్లాన్ చేసిన‌ట్టు మొద‌టి నుంచి చెప్తూ వ‌స్తున్నారు ద‌ర్శ‌క, నిర్మాత‌లు.

vamsi-mahesh

ఈమూవీకి సంబంధించిన రెగ్యూల‌ర్ షూటింగ్ ను నేడు ప్రారంభించారు చిత్ర‌బృందం. నేటి నుంచి మ‌హేశ్ షూటింగ్ లో పాల్గోనున్న‌ట్లు సమాచారం. సినిమా లోని కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను డెహ్రాడూన్ లో చిత్రిక‌రించ‌నున్నారు. ఈసినిమాలో మ‌హేశ్ కొత్త లుక్ లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. అందుకోసం మ‌హేష్ గ‌డ్డం కూడా పెంచిన విష‌యం తెలిసిందే. మ‌హేశ్ కొత్త లుక్ పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే.

Mahesh-Babu

ఈసినిమాలో మ‌హేశ్ ఎంబీఏ స్టూడెంట్ గా న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. గ‌తంలో మ‌హేశ్ స్టూడెంట్ గా న‌టించిన శ్రీమంతుడు చిత్రం భారీ విజ‌యాన్ని అందుకుంది. మ‌హేశ్ స‌ర‌స‌న పూజా హెగ్దె హీరోయిన్ గా న‌టించ‌నుంది. ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు మ‌షేశ్ అభిమానులు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, అశ్విని ద‌త్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. సంక్రాతి బ‌రిలో ఈమూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే సంక్రాంతి బ‌రిలో ప‌లు మూవీలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ బ‌యెపిక్, రామ్ చ‌ర‌ణ్, బోయ‌పాటిల సినిమాలు కూడా సంక్రాతి బ‌రిలోకి వ‌స్తున్నాయి. సంక్రాంతి బ‌రిలో ఉన్న ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఎవ‌రూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తారో చూడాలి.