అనుష్క, ముందు కోహ్లీని కంట్రోల్లో పెట్టు..

272
anushka
- Advertisement -

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవలె అనుష్కశర్మ, కోహ్లీ కారులో వెళ్తుండగా అర్హాన్ సింగ్ అనే వ్యక్తి కారులో నుంచి ఓ ప్లాస్టిక్ కవర్ ను రోడ్డుపై పడేశాడు. ఇది చూసిన అనుష్క వెంటనే కారు ఆపి ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డుపై చెత్త వేయకూడదని తెలియదా..? డస్ట్ బిన్ ఉపయోగించు అంటూ అతనిపై కేకలు వేసింది. ఈ ఘటనను విరాట్ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఎవరైనా చెత్త పడేయటం చూసినప్పుడు మీరు ఇలాగే ప్రశ్నించండి అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.

Anushka Sharma Control First Your Huband AT Cricket Groud

ఈ ట్వీట్ పై అర్హన్ సింగ్ స్పందించారు. పొరపాటున చెత్తను రోడ్డుపై పడేశాను. తప్పు నాదే అంటూ క్షమాపణలు కోరాడు. కానీ అనుష్క, విరాట్ ప్రవర్తనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సెలబ్రిటీ అయి ఉండి ఓ సామాన్యుడితో ఇలాగే ప్రవర్తిస్తారా..? అంటూ మండిపడ్డారు. ఇలా మాట్లాడడం మర్యాద అనుపించుకోదని సూచించారు. నేను రోడ్డుపై పడేసిన చెత్తకంటే అనుష్క నోటి నుంచి వచ్చే చెత్తే ఎక్కువ ఉంది అని అన్నారు. ఆయనకు అతని తల్లి, అక్క కూడా మద్దతు పలికారు. అవును తప్పు మాదే కానీ రోడ్డుమీద అలా తిట్టడం.. వీడియోని తీసి పోస్టు చేయడం సబబు కాదని చెప్పారు.

ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో అనుష్కకు కౌంటర్లు వేస్తుస్తున్నారు. ముందు నీ భర్తను కంట్రోల్ లో ఉంచుకో. రోడ్డుపై చెత్తపడేసే వాళ్లను తిట్టడం కాదు. మైదానంలో నీ భర్త బూతులు మాట్లాడకుండా అదుపులో పెట్టుకో అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మీ బర్త్ డే పార్టీలకు కేక్ లను మొఖాలకు పూసుకుంటున్నారు. ఎంతో మంది ఆకలితో అలమటిస్తుంటే అవి మీకు కనపడవు. ఈ సారి కేక్ కాదు ఆవు పేడ మొఖానికి పూసుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సెలబ్రిటి హోదాలో ఉండి ఓ వ్యక్తిని అలా రోడ్డుపై తిట్టడం సబబు కాదు. ముందు మర్యాదగా చెప్పి చూడాలి. అంతేకానీ నీవు ఆయన బాస్ వలే తిట్టడం పద్దతి కాదు. నీ భర్త ఆ వీడియోని ట్విట్టర్లో పెట్టడం మరో పెద్ద తప్పు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

- Advertisement -