పీవీపీ నమ్మకం నిజమైంది..మహర్షి సక్సెస్‌ మీట్ అక్కడే..!

378
PVP Vamshi Paidipally

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహర్షి. వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా మే9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది.

విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ కాగా ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోలేదు మహర్షి. తొలి షో నుండే మంచి వసూళ్లను రాబడుతూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మహేష్.

ఇక సినిమా సక్సెస్ ను ముందుగానే అంచనా వేసిన నిర్మాత పీవీపీ విడుదలకు ముందే సక్సెస్ మీట్ డేట్ ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అంచనాలకు ఏ మాతం తీసిపోకుండా విడుదలైన ప్రతి చోటా రికార్డు వసూళ్లను రాబడుతోంది.

ఈ నేపథ్యంలోనే ముందుగా అనుకున్నట్లుగానే ఈ నెల 18న మహర్షి సక్సెస్ మీట్ ని నిర్వహించనున్నారట పీవీపీ. విజయవాడలో పెద్ద ఎత్తున అతిరథ మహారథుల సమక్షంలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సక్సెస్‌ మీట్‌కు ఇప్పటివరకు మహేష్ నటించిన 24 సినిమాల దర్శకులను ఆహ్వానించనున్నారట. మొత్తంగా తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మహర్షితో మహేష్ సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు.