మహర్షి…సెలబ్రేషన్స్‌ షురూ

208
maharshi success

ఉపిరి సినిమా తర్వాత లాంగ్ గ్యాప్‌ తీసుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం మహర్షి. వీకెండ్ వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ప్రీమియర్‌ షో నుండే పాజిటివ్ టాక్ రాబట్టిన ఈ చిత్రం తొలిరోజే వసూళ్ల సునామీ సృష్టించింది. మహేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది.

ఈ నేపథ్యంలో మహర్షి సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది చిత్రయూనిట్. హీరోయిన్ పూజా హెగ్డే,నిర్మాత దిల్ రాజు,సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌తో కలిసి సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. సినిమా పెద్ద హిట్ కావడం ఆనందంగా ఉందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో సహా సినీ ఇండస్ట్రీలోని పెద్దలందరూ సినిమా బాగుందని కితాబిస్తున్నారని చెప్పారు.

mahesh namratha

మరోవైపు తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 61 కోట్ల షేర్‌ని రాబట్టింది మహర్షి. నైజాం ఏరియాలో తొలిరోజే రూ 6.5 కోట్ల వసూళ్లను రాబట్టి నాన్ బాహుబలి 2 రికార్డులను తిరగరాసింది. అమెరికాలో తొలి రోజు 6,66,000 డాలర్ల వసూళ్లు రాబట్టింది.

ఇక గురువారం రాత్రి నుండే మహేష్ ఇంట్లో మహర్షి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. మహేష్‌తో పాటు వంశీ పైడిపల్లి,పూజా హెగ్డే, దేవిశ్రీ ప్రసాద్‌,విజయ్‌ దేవరకొండ ఈ పార్టీలో పాల్గొన్నారు. మహేష్ భార్య నమ్రత ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ట్రెండింగ్‌గా మారింది.