ట్రెండింగ్‌లో మహాసముద్రం

44
maha samudram

విభిన్న కథలను ఎంచుకుంటూ తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్‌ ట్రెండింగ్‌లో నెంబర్‌ 1గా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అందించిన రెండు పాటలకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌.