రేపటితో మహా కుంభమేళా ముగింపు

3
- Advertisement -

144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళా రేపటితో ముగియనుంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటివరకు త్రివేణీ సంగమంలో 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానం చేశారు.

అంటే దేశ జనాభాలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఈ మహా కుంభమేళాలో పాల్గొన్నట్టే. ప్రధాని మోదీతో పాటు రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు, దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుంచి భక్తులు ఈ మహోత్సవానికి తరలివచ్చారు.

మహాకుంభమేళా ముగింపు వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు.మహాకుంభ్ ప్రాంతంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఎంత మంది యాత్రికులు వచ్చినా పోలీసులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.మహాశివరాత్రితో ముగియనున్న మహాకుంభమేళా గత జనవరి 13న పౌష్ పూర్ణిమ సందర్భంగా ఈ మహాకుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే.ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాదిమంది భక్తులు ఈ మహాకుంభమేళాకు తరలి వస్తున్నారు.పవిత్ర గంగ, యమున, సరస్వతి నదులు కలిసి ఏర్పడిన త్రివేణీ సంగమం లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

Also Read:ఇంటర్నెట్ ధరలపై సుప్రీం కోర్టు

- Advertisement -