సామాన్యుడిపై పెట్రో భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.2 ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. గ్లోబల్ మార్కెట్లో ముడి నూనె ధరలు పడిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం పెట్రోల్ మరియు డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
ఈ ఉత్తర్వు ప్రకారం పెట్రోలుపై ఎక్సైజ్ డ్యూటీ రూ.13కి, డీజిల్‌పై రూ.10కి పెంపు చేశారు. ఇది రిటైల్ ధరలపై ప్రభావం చూపుతుందా అనే విషయాన్ని ఉత్తర్వులో స్పష్టంగా చెప్పకపోయినా, ప్రముఖ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు, పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ రిటైల్ ధరలపై ప్రభావం చూపే అవకాశముందని తెలుస్తోంది.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినందున, ఆ తగ్గుదల వల్ల చమురు ధరలు తగ్గాల్సిన చోట, ఆ తగ్గింపును ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సమతుల్యం చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read:పేదోడి ఆరోగ్యానికి భరోసా ఏదీ?: షర్మిల

