రేపు అహ్మదాబాద్ కు వెళ్లనున్నారు సీఎం రేంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు. అహ్మదాబాద్ ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ సమావేశాల్లో చర్చించే అంశాలు, ఎజెండా ముసాయిదా తయారీ కమిటీ సభ్యుడిగా భట్టిని నియమించారు ఏఐసీసీ. తెలంగాణ కాంగ్రెస్ నుంచి మొత్తం 44 మంది నేతలకు ఆహ్వానం అందింది.
జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధత తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనుంది ఏఐసీసీ. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ తీర్మానం, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలను వివరించనున్నారు రేవంత్ రెడ్డి , భట్టి.
Also Read:ఒకే ఏడాదిలో దెబ్బతీశారు: హరీష్ రావు

