ఈ నెల 27న వరంగల్‌లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు 3,000 బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిసింది బీఆర్ఎస్ బృందం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు తుంగ బాలు, బీఆర్ఎస్ నాయకులు డా. కురువ విజయ్ కుమార్ తదితరులు సజ్జనార్‌కు వినతిపత్రం ఇచ్చారు.
వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వరంగల్ బహిరంగ సభ అనంతరం…పార్టీనీ గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ట పరిచి , ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత… నూతన కమిటీల బాధ్యులతో… ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నారు.
Also Read:అహ్మదాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి

