హీరో విశాల్‌కు హైకోర్టు షాక్‌..

155
vishal

హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. విశాల్ నటించిన ‘యాక్షన్’ అనే చిత్రం గతేడాది నవంబరులో రిలీజైంది. ఇందులో విశాల్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా, సుందర్.సి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించాలని చిత్ర నిర్మాణ సంస్థ ట్రైడెంట్ ఆర్ట్స్ భావించింది. అయితే సినిమా రూ.20 కోట్లు వ‌సూలు చేయ‌క‌పోతే ఆ న‌ష్టాన్ని తాను భ‌రిస్తాన‌ని విశాల్ నిర్మాత‌ల‌కు హామీనివ్వ‌డంతో..నిర్మాత‌లు రూ.44 కోట్ల‌తో యాక్ష‌న్ ను నిర్మించారు.

కానీ సినిమా విడుద‌లైన త‌ర్వాత విశాల్ అంచ‌నాలు తారుమార‌య్యాయి. ఈ చిత్రం త‌మిళ‌నాడులో రూ.7.7 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు మాత్ర‌మే వ‌సూళ్లు చేసింది. దీంతో నిర్మాత‌లు న‌ష్టాల‌పై విశాల్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించ‌గా..త‌న త‌దుప‌రి సినిమా ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యాన‌ర్ లోనే తీస్తాన‌ని చెప్పారు. కానీ ఇపుడు విశాల్ కొత్త చిత్రాన్ని సొంత బ్యాన‌ర్ లో తీస్తున్నాడంటూ నిర్మాత‌లు మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం..యాక్ష‌న్ సినిమా వ‌ల్ల న‌ష్ట‌పోయిన నిర్మాత‌ల‌కు విశాలే డ‌బ్బులు చెల్లించాల‌ని, ఈ మేర‌కు విశాల్ రూ.8.29 కోట్లకు గ్యారంటీ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.