- Advertisement -
మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్షపై కొనసాగుతోన్న సందిగ్దత నెలకొంది. ఇవాళ్టిలోగా బలపరీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి కమల్ నాథ్ కు గవర్నర్ లాల్ జీ టాండన్ లేఖ రాశారు. బలం నిరూపించుకోలేకపోతే ప్రభుత్వం మైనారిటీలో పడినట్టుగా భావించాల్సి ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు.
దీంతో కమల్ నాథ్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది.కరోనా ప్రభావంతో ఈ నెల 26 వరకు సభను వాయిదా వేశారు స్పీకర్. నేడు బలపరీక్ష జరుగుతుందా లేదా అన్న అంశంపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. ఇటు మధ్యప్రదేశ్ బలపరీక్ష పై బీజీపీ నేతలు సుప్రీంకర్టును ఆశ్రంయించారు. ఈ పిటిషన్ పై నేడు విచారించనుంది సుప్రీం.
- Advertisement -