అక్కడ కాంగ్రెస్ టార్గెట్ .. 150 సీట్లు ?

53
- Advertisement -

ఈ ఏడాది చివర్లో మరో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ , మిజోరాం వంటి రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి, ప్రస్తుతం ఈ ఐదు రాష్ట్రాలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా ఫోకస్ చేస్తున్నాయి. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అదే సీన్ ఈ ఐదు రాష్ట్రాలలో రిపీట్ చేయాలని చూస్తోంది. అయితే తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ హవా మెండుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధికారం అతిశయోక్తే అవుతుంది. కాబట్టి మిగిలిన రాష్ట్రాలలో హస్తం పార్టీ గట్టిగా దృష్టి పెట్టింది. ఇప్పటికే రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.

మిజోరాంలో ఫ్రంట్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం కష్టమే. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ ఫోకస్ అంతా మధ్యప్రదేశ్ పై పడింది. 2018లో జరిగిన ఎన్నికల్లో 114 సీట్లు కైవసం చేసుకున్నా కాంగ్రెస్.. బిఎస్పీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికి.. కొద్ది రోజులకే 22 మంది ఎమ్మేల్యేలు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీకి మద్దతు పలకడంతో కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో గత పరభావాలను అదిగమించి ఈసారి గ్రాండ్ విక్టరీ సాధించాలని టార్గెట్ పెట్టుకుంది హస్తం పార్టీ. అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతోంది.

Also Read: జూన్ 12.. అసలేం జరగబోతుంది ?

కాగా కర్నాటకలో అమలు చేసిన వ్యూహాలనే ఇక్కడ కూడా అమలు చేసి 150 సీట్లకు పైగా సాధించాలనేది కాంగ్రెస్ ప్లాన్. తాజాగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ, మరియు అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆ రాష్ట్ర నేతలకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఎంతో దూరంలో లేకపోవడం వల్ల అందరూ కలిసికట్టుగా అధికారం కోసం పాటు పాడాలని, మెజారిటీ సీట్లు సాధించడం మాత్రమే కాదని 150 సీట్లకు పైగా సాధించినప్పుడే అధికారాన్ని నిలుపుకోగలమని రాష్ట్ర నేతలకు రాహుల్ గాంధీ సూచించరాట. మరి కర్నాటకలో మాదిరి మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో లేదో చూడాలి.

Also Read: KTR:రెజ‌ర్ల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా..?

- Advertisement -