తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై నిందలు మోపాలని చూస్తోందని కానీ విపక్షాలకు కారణం కూడా దొరకట్లేదని అన్నారు. ముమ్మాటికి మాది కుటుంబ పాలనే అని అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.125కోట్లతో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని అందుకే ప్రతిపక్షాలకు ఏతప్పు దొరక్క కుటుంబ పాలన అని కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
4 కోట్ల మంది తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే అని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులందరికీ పెద్దన్నలాగా కేసీఆర్ అండగా ఉన్నారని ఆడపడుచులకు మేనమామ ఉన్నారని అన్నారు. ఆసరా పెన్షన్లతో వృద్ధులను కడుపులో పెట్టుకుంటున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఈ సందర్భంగా అన్నారు. కేసీఆర్ కిట్ పథకం అమలుతో సర్కార్ దవాఖానాలో ప్రసవాల కోసం క్యూ కడుతున్నారు. గురుకులాల్లో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఈ రాష్ట్రంలో కులం పంచాయితీ లేదు మతం పిచ్చి లేదని అన్నారు. అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం అని తేల్చిచెప్పారు. కొంత మంది రాజకీయ నిరుద్యోగులు పనికిమాలిన పాదయాత్రలు చేస్తున్నారని ఏద్దేవా చేశారు. మీ దిక్కుమాలిన పార్టీకి ప్రజలు 10సార్లు ఛాన్సులు ఇచ్చారని అయిన కరెంట్ నీళ్లు ఇయ్యక రైతన్న ఆత్మహత్యల పాలైండ్రు అని మండిపడ్డారు. తెలంగాణలో అమాయకులు ఎవరూ లేరని ఈ సందర్బంగా మంత్రి గుర్తు చేశారు.
50యేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ వాళ్లు రైతులకు కరెంటు ఇవ్వాలన్న సోయి మీకు వచ్చిందా? ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతాంగానికి నిరంతం కరెంటు ఇస్తున్నామని అన్నారు. అందుకే తెలంగాణ రైతులు పంజాబ్ హర్యానా రైతులతో పోటీ పడి ధాన్యాన్ని పండిస్తున్నారని అన్నారు. చెరువులను బాగు చేసి సాగునీరు అందించి ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. గతంలో తాగునీరు ఇవ్వకుండా మహిళలు ఇబ్బండి పడిన సంగతి గుర్తు లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కరెంట్ సాగు తాగు నీరు ఇవ్వరు… కానీ ఇప్పుడేమో ఎగతాళిగా మాట్లాడుతూ…ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి…