మనీష్‌ అరెస్టును ఖండించిన సీఎం…

19
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ కేసుల్లో భాగంగా ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మోదీ అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత దీన్నిపై సీఎం తొలిసారి మొదటిసారి స్పందించడం గమనార్హం. మనీష్ సిసోడియాను ఢిల్లీ కోర్టు సీబీఐ కస్టడీకి ఇచ్చింది. ఆయన మార్చి 4వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో భాగంగా సిసోడియాను విచారించిన సీబీఐ..సూమారు 8గంటల తర్వాత అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించింది. దీంతో ఐదు రోజుల పాటు కస్టడీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి…

మాది కుటుంబ పాలన…కేటీఆర్

నిందితులు ఎవ్వరైనా వదలం:కేటీఆర్‌

ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలిగా ఖుష్బూ…

- Advertisement -