మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్‌ టార్గెట్‌గా రవిబాబ్ కామెంట్స్!

62
Ravi Babu

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజుకో సస్పెన్స్‌ సీరియల్‌ను తలపిస్తోంది. మంచు విష్ణు- ప్రకాశ్‌ రాజ్ ప్యానల్ మధ్య మాటలయుద్ధం తారాస్ధాయికి చేరగా ముఖ్యంగా లోకల్, నాన్ లోకల్ ఇష్యూ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పందించారు నటుడు రవిబాబు.

ఇది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కాదని… నేను ఈ ప్యానల్ కి ఓటేయండి ఆ ప్యానల్ కి ఓటేయండి అని చెప్పట్లేదని… కానీ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉందన్నారు. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు తీసే వారు మన ఇండస్ట్రీలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులను వదిలేసి బయట భాషలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులను ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి తీసుకువస్తారన్నారు.

మూవీ ఆర్టిస్ట్ సమస్యలను పరిష్కరించుకోవడానికి మా అసోసియేషన్ అనే ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకున్నామని… మన సమస్యలు పరిష్కరించుకోవడానికి పెట్టుకున్న ఈ సంస్థను నడపడానికి కూడా మనలో ఒకరు పనికిరారా అంటూ ప్రకాష్ రాజ్ ని పరోక్షంగా టార్గెట్ చేస్తు మాట్లాడారు రవిబాబు.