మా అబ్బాయి రివ్యూ

305
- Advertisement -

‘ప్రేమ ఇష్క్ కాద‌ల్‌’, ‘ప్ర‌తినిధి’, ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా శ్రీవిష్ణు సోలో హీరోగా నటించిన చిత్రం మా అబ్బాయి. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బేబీ సాక్షి సమర్పణలో కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్ రావు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ‌రి సోలో హీరోగా శ్రీ విష్ణు ఎలాంటి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడో చూద్దాం..

క‌థ‌:

హైద‌రాబాద్‌లో నివ‌సించే హీరో(శ్రీ విష్ణు)ది మద్యతరగతి కుటుంబం.  లైఫ్ ఆనందంగా సాగిపోతున్న స‌మ‌యంలో ఆనంద‌రావు కూతురుకి పెళ్ళి నిశ్చ‌య‌మ‌వుతుంది. కూతురు పెళ్ళి కోస‌మ‌ని కుటుంబ‌మంతా క‌లిసి షాపింగ్‌కు వెళ‌తారు. అప్పుడు జ‌రిగిన బాంబు పేలుళ్ళ‌లో అబ్బాయి మిన‌హా అంద‌రూ చ‌నిపోతారు. దాంతో స‌ద‌రు అబ్బాయి, బాంబు దాడికి కార‌ణ‌మైన వారిపై ప‌గ పెంచుకుని, సంఘ విద్రోహుల ప‌ని ప‌ట్ట‌డానికి నిర్ణ‌యించుకుంటాడు. ఇంత‌కు ఆ అబ్బాయి సంఘ విద్రోహుల‌పై ప్ర‌తీకారం తీర్చుకున్నాడా?తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Maa Abbai Telugu Movie Review

ప్లస్ పాయింట్స్:

డిఫ‌రెంట్ సినిమాల‌ను చేస్తూ వ‌చ్చిన శ్రీ విష్ణు ఈసారి కాస్తా క‌మ‌ర్షియ‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో మాస్‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేశాడు. డ్యాన్సులు, ఫైట్స్‌లో శ్రీ విష్ణు కాస్తా బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు. హీరోయిన్ చిత్ర శుక్ల లుక్ ప‌రంగా చూడ‌టానికి బావుంది. త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. కాశీవిశ్వ‌నాథ్‌, స‌నా, జెమిని సురేష్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

స‌ర్వం కోల్పోయిన హీరో పైకి మామూలుగా క‌నిపిస్తూ లోలోప‌ల ఎవ‌రికీ తెలియ‌కుండా సంఘ‌విద్రోహ శ‌క్తుల ప‌నిపట్ట‌డ‌మ‌నేది తెలుగు స్క్రీన్ మీద కొత్తేమీ కాదు. ఈ చిత్రంలో అదే విష‌యం క‌నిపించినా ద‌ర్శ‌కుడు కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నాలు ఎక్క‌డా చేయ‌లేదు. సినిమాను హ్యండిల్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు కుమార్ వ‌ట్టి ఆకట్టుకోలేక‌పోయాడు.హీరో హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ సీన్స్ క‌న్విసింగ్‌గా అనిపించ‌వు. టైటిల్ విని ఇదేదో మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అనుకుని వ‌స్తారు. ముందు కాస్తా ఆఫీలింగ్ ఉన్నా, త‌ర్వాత సినిమా క‌క్ష్య‌, ప్ర‌తీకారాల‌తోనే సాగుతుంది.

Maa Abbai Telugu Movie Review
 
సాంకేతిక విభాగం:

నిర్మాణ విలువ‌లు బావున్నాయి. హీరోకున్న మార్కెట్‌ను మించి నిర్మాత పెట్టిన ఖ‌ర్చు ప్ర‌తి సీన్‌లోనూ, షాట్‌లోనూ తెలుస్తుంది.  మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేష్ బొబ్బిలి ట్యూన్స్ ఒక‌ట్రెండు ప‌రావాలేదనిపించాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకోలేదు. థ‌మ శ్యామ్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. మంచి లోకేష‌న్స్‌లో సినిమాటోగ్రాఫ‌ర్ సీన్‌ను బాగా ఎలివేట్ చేయాలి. సినిమా నాన్‌సింక్‌గా ర‌న్ అవుతుంటుంది. తాను ఎంచుకున్న కథను పూర్తిస్ధాయిలో హ్యండిల్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యారు.
 
తీర్పు:

తెలుగు సినిమాకు ఇలాంటి కథలు కొత్తేమి కాదు. అయినా అదే కథతో ముందుకువచ్చిన దర్శకుడు కుమార్ వట్టిని అభినందించాల్సిందే. అయితే,తాను అనుకున్న కథను తెరమీద సక్సెస్‌ ఫుల్‌గా చూపించడంలో విఫలమయ్యాడు. శ్రీవిష్ణు నటన సినిమాకు ప్లస్ పాయింట్ కాగా రోటిన్ స్టోరీ మైనస్ పాయింట్. మొత్తంగా సోలో హీరోగా శ్రీవిష్ణు చేసిన ప్రయత్నం ఫలించలేదనే చెప్పాలి.

విడుదల తేదీ:17/03/2017
రేటింగ్‌: 2.5/5
నటీనటులు: శ్రీ విష్ణు, చిత్ర శుక్ల‌
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత: బ‌ల‌గ ప్ర‌కాష్ రావు
ద‌ర్శ‌క‌త్వం: కుమార్ వ‌ట్టి

- Advertisement -