నేనోరకం:రివ్యూ

288
- Advertisement -

తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో హీరో సాయి రామ్ శంకర్ వరుస పరాజయాల తర్వాత చేసిన చిత్రం ‘నేనోరకం’. ఈ చిత్రం భారీ ప్రమోషన్లతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎంతవరకు మెప్పించగలిగిందో ఇప్పుడు చూద్దాం…

కథ :
గౌతమ్ (సాయిరాం శంకర్) ఒక ఫైనాన్స్ కంపెనీలో లోన్ రికవరీ ఏజెంట్ గా పని చేస్తుంటాడు. ఆ సమయంలోనే స్వేచ్ఛ (రేష్మి మీనన్) తో ప్రేమలో పడతాడు. ఒక అపరిచితుడు (శరత్ కుమార్) స్వేచ్ఛని కిడ్నాప్ చేస్తాడు మరియు తనని ఒదిలేయాలంటే నేరాలు చేయమని గౌతమ్ ని బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. అలా అతని లైఫ్ సెట్టైపోతోంది అనుకునే సమయంలో శరత్ కుమార్ అతని లైఫ్ లోకి ఎంటరై ఊహించని ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తాడు. అసలు శరత్ కుమార్ ఎవరు? అతను గౌతమ్ జీవితంలోకి ఎందుకొచ్చాడు ? గౌతమ్‌ స్వేచ్ఛను కాపాడ గలిగాడా ? కిడ్నాపర్ కు మరియు ఈ లవర్స్ కు మధ్య సంబంధం ఏమిటి ? అనేవి మిగతా కథ ద్వారా సమాధానం దొరుకుతుంది.

Nenorakam-Telugu-Movie-Stills-680x400

ప్లస్ పాయింట్స్ :
సెకండాఫ్ నుంచే అసలు సినిమా మొదలౌవుతుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ తో మొదలయ్యే సెకండాఫ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శరత్ కుమార్ హీరో సాయి రామ్ శంకర్ ను కంటికి కనిపించకుండా ఒక ఆట ఆడుకోవడం బాగుంది. ఆ ఆటలో హీరో చేత శరత్ కుమార్ ను బెదిరించడం, అతన్ని పరిగెత్తించి పరిగెత్తించి టెన్షన్ పెట్టడం, తాను అనుకున్నవన్నీ చేయించడం వంటి సన్నివేశాలు బాగా మెప్పించాయి. సెకండాఫ్ మొత్తాన్ని శరత్ కుమార్, హీరో సాయి రామ్ శంకర్ లు తమ పెర్ఫార్మెన్స్ తో సక్సెస్ ఫుల్ గా నడిపారు.

సాయి రామ్ శంకర్ బాగా నటించాడు. రేష్మి మీనన్ అందంగా కనిపించింది కానీ నటన మెరుగుపరుచుకోవాలి. కిడ్నాపర్ గా గౌతమ్ ని తను అనుకున్న పని సాధించడానికి తెలివిగా ఉపయోగించుకునే పాత్రలో శరత్ కుమార్ సరిగ్గా సరిపోయారు. అలాగే ఎమోషనల్ గా ఉండే శరత్ కుమార్ గతం, అతను హీరో లైఫ్ లోకి ఎందుకు వచ్చాడనే సంగతి సినిమా ఆఖర్లో రివీల్ చేయడం కొత్తగా ఉండి ఆకట్టుకున్నాయి. దర్శకుడు సుదర్శన్ సాలేంద్ర సినిమాకు కీలకమైన సెకండాఫ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. సాయి రామ్ శంకర్, శరత్ కుమార్ పాత్రల మధ్య అతను నడిపిన డ్రామా సినిమాకే హైలెట్ గా నిలిచింది. సాయి రామ్ శంకర్ కూడా ఇదివరకటి సినిమాలకంటే ఇందులో మెరుగ్గా నటించాడు.

Sairam Shankar, Reshmi Menon in Nenorakam Movie Images

మైనస్ పాయింట్స్ :
సినిమాలో ఫస్టాఫ్‌ నుండి ఇంటర్వెల్ ముందు వరకు హీరో హీరోయిన్ మధ్య నడిచే కొన్ని రొమాంటిక్ సీన్లు, కామెడీ సీన్లు మినహా మిగతా కథనం అంతా ఏదో సమయం గడపాలి కాబట్టి నడిపినట్టు ఉంది. ఎంఎస్ నారాయణ, వైవా హర్షల కామెడీ సాగదీయడంతో ఒక దశలో చిరాకు కలిగింది. ఇక సెకండాఫ్ ఆరంభమయ్యే వరకు సినిమా అసలు కథలోకి వెళ్లకపోవడంతో ఫస్టాఫ్ నీరసంగా తయారైంది.

సాంకేతిక విభాగం :
దర్శకుడు సుదర్శన్ సాలేంద్ర ఫస్టాఫ్ విషయంలో కాస్త విఫలమైనా సెకండాఫ్లో మాత్రం మ్యాగ్జిమమ్ మార్కులు దక్కించుకున్నాడు. ఒక మంచిపాయింట్ ను డిఫరెంట్ యాంగిల్ లో ప్రెజెంట్‌ చేయడంలో ఆకట్టుకున్నాడు. సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ అందించిన ఆర్ఆర్ సినిమాకు బాగా హెల్ప్ అయింది. శ్రీకాంత్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. . ఈ సినిమా మహిత్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో టెక్నికల్ గా పరవాలేదు. పాటలు భయంకరంగా ఉన్నాయి. అయితే సినిమాటోగ్రఫీ సినిమాకు థ్రిల్లర్ ఫీల్ ని కలిగించింది.

తీర్పు:
ఈ ‘నేనోరకం’ చిత్రం సస్పెన్స్ తో కూడిన సెకండాఫ్ డ్రామా, శరత్ కుమార్, సాయి రామ్ శంకర్ ల నటన, హీరోయిన్ రేష్మి మీనను స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాలో మెప్పించే అంశాలు. మొత్తం మీద కాస్త సాగదీసినట్టు ఉండే ఫస్టాఫ్ ను తట్టుకోగలిగితే మంచి స్టోరీ లైన్, సస్పెన్స్ డ్రామా కలిగిన ఈ చిత్రం తప్పక మెప్పిస్తుంది.

విడుదల తేదీ : మార్చి 17, 2017
రేటింగ్ : 3/5
నటీనటులు :సాయి రామ్ శంకర్, రేష్మి మీనన్, శరత్ కుమార్
సంగీతం :మహిత్ నారాయణ్
నిర్మాతలు :శ్రీకాంత్ రెడ్డి
దర్శకత్వం :సుదర్శన్ సాలేంద్ర

- Advertisement -