బాల మామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు-లోకేశ్

229
Lokesh Wish To Unkle Balakrisna

నేడు నందమూరి నటసింహం బాలకృష్ణ సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి నారా లోకేశ్. నందమూరి నటసింహం బాల మామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీరు నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో మిమ్మల్ని ఎన్టీఆర్ పాత్రలో ఈ ఏడాదిలో చూసేందుకు ఎదురుచూస్తున్నా అని ట్వీట్ లో పేర్కొన్నారు.

Lokesh Wish To Unkle Balakrisna

ఇక సినీ ప్రముఖులు సైతం బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాలయ్య బాబు జరుపుకుంటున్న ఈ బర్త్ డే ఎంతో ప్రత్యేకమైందని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు, ఆయన నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ సీనియర్ నటుడు నరేష్ ట్వీట్ చేశారు.

మరోవైపు బాలయ్య 58వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆస్పత్రిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు బాలయ్య అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అభిమానుల, చిన్నారుల కోలాహలం మధ్య బాలయ్య కేక్ కట్ చేశారు. ఈ నేపథ్యంలో బాలయ్య మాట్లాడుతూ.. మా అమ్మ కోరిక మేరకు ఈ ఆస్పత్రి స్థాపించామని చెప్పారు. మా అమ్మ కూడా కేన్సర్ తో బాధపడ్డారని అన్నారు. ఈ ఆస్పత్రిలో పేదలకు కేన్సర్ చికిత్స తక్కువ ధరకు అందిస్తున్నామని తెలిపారు. ఏపీ రాజధానిలోనూ బసవతారకం ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.