‘మా’ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

271
- Advertisement -

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) హెల్త్ క్యాంప్ ప్రతి నెల రెండో ఆదివారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు రెండో ఆదివారం మా ఆధ్వర్యంలో గ్లోబల్ హాస్పిటల్ వారు హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈసీజీ, టూడీ ఈసీజీ, ఆర్‌బీఎస్‌, బీపీ, హైట్‌, వెయిట్‌ మొదలయిన పరీక్షలు నిర్వహించారు.

MAA Health Camp

కార్డియాలజీ నిపుణులైన డా.కిరణ్ మరియు జనరల్ ఫిజిషియన్ డా.సతీష్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ’మా‘ సభ్యులందరూ ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ వి.కె.నరేష్, వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, హెల్త్ కమిటీ చైర్మన్ నాగినీడు, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -